They Must come: మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదని, కన్నీరు తుడవడానికి ఉందని, బోండా ఉమా లాంటి వారికి కన్నీరు పెట్టించడానికే ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. బోండాలాంటి ఆకు రౌడీల పట్ల మహిళా కమిషన్ సుప్రీమే అని ఘాటుగా బదులిచ్చారు. నిన్న విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా లకు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె సమర్ధించుకున్నారు. నేడు పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు , బోండా ఉమా సమన్లు తీసుకోవాలని, ఈనెల 27న వారిద్దరూ రావాల్సిందే, మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. అత్యాచారం జరగడం అత్యంత దురదృష్టకరమని, అలాటి ఓ బాధితురాలిని పరామర్శించే సమయంలో రాజకీయాలేమిటని ఆమె ప్రశ్నించారు. బాబు, టిడిపి నేతలు వ్యవహరించిన తీరుకు సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారా అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని, తాము ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే స్పందించి తగిన న్యాయం చేస్తున్నామన్నారు. బాధితురాలికి ధైర్యం ఇవ్వకపోతే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేనేం చేయాలని ప్రశ్నించారు.
చంద్రబాబు కనీస మానత్వం చనిపోయారని, పరామర్శకు వచ్చినట్లు లేదని, ఆ అరుపులు ఏంటీ? ఆ కేకలు ఏమిటని పద్మ విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు మానవత్వంలేని రాజకీయాలు చేస్తున్నారని, అసలు అయన పరామర్శకు వచ్చారా..? దాడికి వచ్చారా అని ప్రశించారు.
Also Read : సిగ్గుపడుతున్నా: చంద్రబాబు