Saturday, January 18, 2025
HomeTrending Newsఫలాయన వాదమా? చంద్రబాబు

ఫలాయన వాదమా? చంద్రబాబు

what is the answer? ప్రత్యేక హోదా విషయంలో సిఎం జగన్ ఫలాయనవాదం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  హోదా కోసం యుద్ధం చేస్తామని , రాజీనామాలు చేస్తామని గతంలో చేసిన సవాళ్లు ఏమయ్యాయని  ప్రశ్నించారు. హోం మంత్రిత్వ శాఖ అజెండాలో ప్రత్యేక హోదా అంశం తమ ఘనతే అని చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు తమపై బురద జల్లడం ఏమిటన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గకపోయినా అస్తవ్యస్త విధానాలతో ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినిమా పరిశ్రమను జగన్  కించపరిచారని, సినీ రంగంలో లేని సమస్యను సృష్టించి హీరోలను అవమాన పరిచారని బాబు  మండిపడ్డారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వారు జగన్ ని ప్రాదేయపడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కుపై ఎందుకు మాట్లాడడం లేదు? గ్రామాల్లో విద్యార్ధులను బడులకు దూరం చేయడమే నాడు-నేడు పథకామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు  వ్యవసాయ మోటార్లకు  మీటర్లు బిగించడం నిలిపివేయాలని డిమాండ్ చేసిన బాబు,  పేదలకు చేరాల్సిన ఉపాధి హామీ పనుల్లో వైసీపీ నేతలు చేస్తున్న అవినీతిపై పోరాటం చేస్తామని వెల్లడించారు.

Also Read : పసలేని ఆరోపణలు : జీవీఎల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్