Sunday, January 19, 2025
HomeTrending NewsChandrababu: నా పార్టీనే - నా భవిష్యత్ : బాబు నినాదం

Chandrababu: నా పార్టీనే – నా భవిష్యత్ : బాబు నినాదం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, దీని కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, రాష్ట్రం ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన బూత్ – మన భవిష్యత్ అనే నినాదంతో పని చేయాలని, నాయకులెవరూ తన వద్దకు రావాల్సిన పని లేదని, బూత్ లెవల్ లో కష్టపడి పనిచేసి మెజార్టీ సాధించిన నాయకుడు తనకు దగ్గరగా ఉంటారని, వారి వద్దకు తానే వెతుక్కుంటూ వస్తానని హామీ ఇచ్చారు.  ఏ నాయకుడూ పైరవీలు చేయాల్సిన పనిలేదని, క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే వారికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు బద్వేల్ లో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు.  తెలుగుజాతి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ముందు,  ఆ తరువాత గా ఉంటుందని చెప్పారు.

సిఎం జగన్ పాలనలో భూ కబ్జజాదారులు పెట్రేగి పోతున్నారని, తాము అధికారంలోకి రాగానే వారి పనిపడతామని బాబు హెచ్చరించారు. ఈ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని, ఇచ్చేది పది రూపాయలు, తీసుకునేది వంద రూపాయలుగా ఉందని విమర్శించారు. రెండు లక్షల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా పంచానని చెబుతున్న సిఎం జగన్ మరో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

రాష్ట్రానికి, బద్వేల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి వీరారెడ్డి చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పార్టీ విజయానికి వీరారెడ్డి స్పూర్తితో నేతలు, కార్యకర్తలు పని చేయాలని పార్టీ భవిష్యత్తే తన భవిష్యత్తుగా భావించి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పాటుపడాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్