Wednesday, June 26, 2024
HomeTrending Newsచెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిగత విమర్శలు: పెద్దిరెడ్డి

చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిగత విమర్శలు: పెద్దిరెడ్డి

గతంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కూడా సిఎం జగన్ పై అనుచిత విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని స్థితిలో బాబు ఉన్నారని, ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.

నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదని,  జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరని పెద్దిరెడ్డి ప్రసంశలు కురిపించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసిపి ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. 30 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారని, వీటిలో  18 లక్షల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 3200 పైగా జబ్బులకు… 25 లక్షల రూపాయల పరిమితి వరకు  ఉచిత వైద్యం అందిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని…. పార్టీ, కులం, మతం కాకుండా  కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు.
రాజంపేట ఎంపిగా పోటీ చేస్తోన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడున్నరేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.  జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తానని, రాష్ట్రాన్ని విడగొడతాని ఢిల్లీ లో చెప్పి సిఎం పదవి పొందారన్నారు.  హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని దుయ్యబట్టారు.  ఆయన సిఎంగా ఉన్నప్పుడు మనప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని,  రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఆయనేనన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్