Sunday, January 19, 2025
HomeTrending Newsపోలీసు శాఖను మూసేశారా? బాబు ఫైర్

పోలీసు శాఖను మూసేశారా? బాబు ఫైర్

గన్నవరం సంఘటనపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖను వైసీపీలో విలీనం చేశారా అంటూ అంటూ ప్రశ్నించారు. దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా బాబు నిరసన వ్యక్తం చేశారు.

“గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్