Sunday, January 19, 2025
HomeTrending NewsAmbati: బాబూ.. నీకా అర్హత లేదు: మంత్రి రాంబాబు

Ambati: బాబూ.. నీకా అర్హత లేదు: మంత్రి రాంబాబు

రాయలసీమతో పాటు, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు ద్రోహం చేసిన వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబేనని,  అందుకే ఆయా రంగాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు ఏ మాత్రం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇరిగేషన్‌పై పార్టులు పార్టులుగా చంద్రబాబు క్లాసులు, ఉపన్యాసాలు చేస్తున్నారని, అవి ఇంకా అయినట్లు లేదని, రోజూ ఒక గంటసేపు తన ఉపన్యాసాన్ని వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీస్‌లో  అంబటి మీడియాతో మాట్లాడారు.

  • ఇంతకు ముందు వ్యవసాయంపై సుధీర్ఘంగా మాట్లాడి దానిపై ఎవరూ మాట్లాడలేదు అన్నాడు.
  • దానికి ఖచ్చితమైన సమాధానం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి ఇచ్చారు. బహుశా ఆయన చూడలేదేమో?
  • ఇరిగేషన్‌పై తన సుధీర్ఘంగా ఉపన్యాసం చెప్తూ జగన్‌గారు
  • రాయలసీమ ద్రోహి అని బ్రాండ్‌ చేయడానికి ప్రయత్నించాడు.
  • బహుశా రాయలసీమను ఉద్దరించడానికి పుట్టిన మహానుభావుడిని తానే అని చంద్రబాబు అభిప్రాయం అనుకుంటా.
  • రాయలసీమను దుర్భిక్షం నుంచి కాపాడటానికి, రతనాల సీమగా చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడట!. కొంత మేర చేశాడట!. ఇంతలో అధికారంలోంచి దించేశారట.
  • లేకపోతే ఈపాటికి రాయలసీమను రతనాల సీమగా చేసే వాడిననేది ఆయన సారాంశం. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు.. కోతలు మాత్రమే.
  • నన్ను ఉద్దేశించి చంద్రబాబు ఇరిగేషన్‌ మంత్రి గారు తన నియోజకవర్గంలో గుర్రపు డెక్క కూడా తొలగించలేకపోతున్నాడు.
  • రైతులే డబ్బులేసుకుని గుర్రపు డెక్క తొలగిస్తున్నారు అంటాడు
  • నేను నోరు మొదపలేదు అంటాడు..నేను నోరు తెరిస్తే నోరేసుకు పడ్డాను అంటాడు.
  • మా నియోజకవర్గంలో గుర్రపుడెక్క ఎక్కడుంది బాబూ?.
  • నీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు..
  • బాబూ ఏవీ నువ్వు నింపిన రిజర్వాయర్లు..? ఏమైపోయాయి..? ఎక్కడున్నాయి..?
    14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టును జాతికి అంకితం చేశావా..?
    ఇవాళ వచ్చి నీతి వాఖ్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
  • చిత్తశుద్ధిగా ఈ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి డాక్టర్‌ వైఎస్సార్‌.
  • రాయలసీమ, ఉత్తరాంధ్రనే కాదు..సముద్రంలో కలిసిపోతున్న వేల టీఎంసీల నీటిని భూమార్గం పట్టించాలని జలయజ్ఞం ప్రారంభించిన వ్యక్తి డాక్టర్‌ వైఎస్సార్‌.
  • ఆ ప్రీక్లోజ్‌ ఏమిటో అర్ధం కావడం లేదు. 198 ప్రాజెక్టులను ప్రీక్లోజ్‌ చేశామని చంద్రబాబు చెప్పాడు. ఆయన మాటల్ని సరిచేసుకోమని చెప్తున్నా.
  • రాష్ట్రంలో ఉన్నదే మొత్తం 54 ప్రాజెక్టులు. వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
  • మరి 198 ప్రాజెక్టులు ఎలా ప్రీక్లోజ్‌ చేశామో నాకైతే అర్ధం కావడం లేదు. 198 ప్రాజెక్టులు కాదు. 198 ప్యాకేజీలను మాత్రమే ప్రీక్లోజ్‌ చేయడం జరిగింది.
  • దానికి కారణం దశాబ్ధాల క్రితం టెండర్లు పిలిచి నీ హయాంలో పని చేయకుండా ఎక్కడైతే డబ్బు వస్తుందో అక్కడ జుర్రుకుని.. లాభాలు లేని చోట పనులు చేయకుండా వదిలేశాడు.
  • దీంతో ఏ కాంట్రాక్టరూ ముందుకు రాని పరిస్థితి. అయితే వాటిని ప్రీక్లోజ్‌ చేసి ఐదేళ్ల వరకూ టెండర్లు పిలవడానికి వీల్లేదని నిర్ణయించామనడం కూడా పచ్చి అబద్దం.
  • పాత రేట్లకు టెండర్లు పిల్చి, పనులు అప్పగిస్తే, ఆ పనులు మధ్యలో ఆపేస్తే ఏం చేయాలి?
  • నీ టైంలో ఆ పనులు చేయించలేదు. కేవలం డబ్బులు వచ్చే పనులు చేసి మిగిలినవి వదిలేశావు.
  • వైఎస్సార్‌ గారు బతికుంటే ఈ పాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి.
  • జగన్‌ గారు ప్రాధాన్యం ప్రకారం చేసే బాధ్యతను తీసుకున్నారు.
  • ప్రాజెక్టులపై అత్యంత చిత్తశుద్ధి కలిగిన కుటుంబం వైఎస్‌ కుటుంబం.
  • చంద్రబాబు రాయలసీమలో పుట్టినా రాయలసీమ లక్షణాలు లేని వ్యక్తి.
  • రాయలసీమ, ఆంధ్ర రాష్ట్ర ద్రోహి చంద్రబాబు.

అంటూ అంబటి బాబుపై ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్