చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని, అదే జరిగితే ఎన్టీఆర్ ఆత్మ ఎంతో సంతోషిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటారన్నారు. 118 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పే ధైర్యం బాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ యేవో మాటలు చెప్పి తప్పించుకున్నారని, ఈ కేసులో ఇక బాబు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. విజయవాడలో ఆమె పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. బాబు తప్పు చేసిన మాట వాస్తవమని, ఈ అవినీతి వ్యవహారంపై సిబిఐ, ఈడీలు విచారణ చేపట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఐటి నోటీసులపై ఎల్లో మీడియా, లోకేష్, పవన్ కళ్యాణ్ లు ఎందుకు మాట్లాడారని అడిగారు.
తనపై ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానినుంచి దృష్టి మరల్చడానికి సానుభూతి డ్రామాలు ఆడడం బాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. గతంలో ఓటుకు నోటు సమయంలోనూ ఇలాగే చేశారని, పారిపోయి వచ్చి… కక్ష సాధింపు అంటూ మాట్లాడారని.. 2019 ఎన్నికలకు ముందు కూడా మోడీ ప్రభుత్వం తనను వేధిస్తోందని చెప్పారని గుర్తు చేశారు.
ఎన్ని సింపతీ డ్రామాలు ఆడినా బాబు తప్పున్చుకునే అవకాశం లేదని, సాక్ష్యాధారాలతో పక్కాగా దొరికారని అన్నారు. బాబు అరెస్ట్ చేసినంత మాత్రాన రాష్ట్రానికి గానీ, దేశానికి గానీ వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు.