Friday, November 22, 2024
HomeTrending NewsYSRCP: బాబుకు భవిష్యత్తు తెలిసింది: సజ్జల

YSRCP: బాబుకు భవిష్యత్తు తెలిసింది: సజ్జల

ఆదాయపన్నుశాఖ నోటీసులతో చంద్రబాబుకు భవిష్యత్తు అర్ధమైనట్లు ఉందని, తనను రెండు మూడు రోజులలో అరెస్ట్ చేస్తారంటూ నానా రాధ్దాంతం చేస్తున్నారని వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవహారం చూస్తే దొంగతనం చేసిన వ్యక్తి దబాయించినట్లుగా ఉందన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన అవినీతి వ్యవహారాలకు రుజువులు ఉన్నాయని ఇప్పటికి వరకు తాము చెబుతూ వస్తున్న అంశాలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. ఐటీ నోటీసులు చిన్నవిషయంగా దగ్గుబాటి పురంధేశ్వరి  పేర్కొనడం అభ్యంతరకరమన్నారు,  మరిదిని రక్షించాలన్న ఆమె ఎత్తుగడ అర్థం అవుతుందన్నారు. ఈ విషయంపై దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు కూడా ఇంకా నోరు మెదకపోవడం దారుణమన్నారు. ఈనాడు,ఆంధ్రజ్యోతిలలో చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయం కనీసంగా రాయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఐటి ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదని అన్నారు.చంద్రబాబు నిప్పు కాదు తుప్పులాంటి వ్యక్తి అని విమర్శించారు.

చంద్రబాబును ఏదైనా కేసులో ఇరికించాలనే ఆలోచన మాకు లేదని, లేకపోతే జగన్ అధికారంలోకి రాగానే తాము కేసులు పెట్టి లోపలేయించేవాళ్లమన్నారు. అమరావతి అభివృధ్ది పనులకు సంబంధించి సెక్రటేరియట్,టిడ్కో ఇళ్ల నిర్మాణం,స్కిల్ డెవలప్ మెంట్ లో కుంభకోణాలకు సంబంధించి షాపుర్జీ, పల్లోంజీ సంస్ధకు చెందిన డాక్యుమెంట్లలో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది ఐటీ జారీచేసిన నోటీసులలో వివరంగా ఉందన్నారు.

“అసెంబ్లీ, సెక్రటేరియట్‌ తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన రేటు అత్యంత అవినీతిమయం. హేయం. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌ ఏకంగా రూ. 600 కోట్లకు పైగానే. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ. 10 వేలకు పైగా చెల్లించారు.ఇంకా పేదల ఇళ్ల (టిడ్కో) నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 2200 చొప్పున ఇచ్చారు. నిజానికి అప్పట్లో ఆ ఇంటి నిర్మాణంలో ఎస్‌ఎఫ్‌టీకి రూ. 1000 కి మించి కాదు. కానీ పేదల జేబు కొట్టి.. వారిని కూడా దోచుకున్న ప్రభుత్వం చంద్రబాబుది. పేదలు తమ ఇంటి కోసం అప్పు చేస్తే.. దాన్ని వారు 20 ఏళ్ల పాటు తిరిగి చెల్లించేలా చేశారు. అలా రాజధానిలో నిర్మాణాలు, నిరుపేదల ఇళ్ల (టిడ్కో)లోనూ చంద్రబాబు దుర్మార్గమైన అవినీతి ఆరోజు అందరికీ తెలిసినా.. ఇప్పుడు ఆ ఆధారాలు బయట పడ్డాయి” అంటూ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్