Saturday, January 18, 2025
HomeTrending Newsవియ్యంకుల మధ్య 'అన్ స్టాప‌బుల్' ముచ్చట్లు

వియ్యంకుల మధ్య ‘అన్ స్టాప‌బుల్’ ముచ్చట్లు

ప్రముఖ ఓటిటి మాధ్యమం ‘ఆహా’లో నందమూరి  బాలకృష్ణ ‘అన్ స్టాప‌బుల్‘  సెకండ్ సీజ‌న్  అతి త్వరలో ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ ఆంథెమ్ ను విడుదల చేేశారు. “ఏదీ.. నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్” అని బాలయ్య చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ర్యాప్ సాంగ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్ కి గెస్ట్ ఎవరో తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ షో లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియో లో  నేడు జరిగిన షూటింగ్ లో  ఆయన  పాల్గొన్నారు. అల్లుఅరవింద్, బాలకృష్ణ  చంద్రబాబుకు సాదర స్వాగతం పలికారు.

ఒకప్పటి బా వా బావామరుదులు- నేటి వియ్యంకులు ఇద్దరి మధ్యా జరిగే సంభాషణలు…. సినీ, రాజకీయ విశేషాలు ఓటిటి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్