Monday, February 24, 2025
HomeTrending Newsఫూలే  స్ఫూర్తితోనే టిడిపి ఆవిర్భావం: బాబు

ఫూలే  స్ఫూర్తితోనే టిడిపి ఆవిర్భావం: బాబు

జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.

“కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషుల సమానత్వం, బడుగు వర్గాల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితమిచ్చిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే. ఫూలే ఆశయ స్ఫూర్తితో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి కృషి చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే దానికి కారణం తెలుగుదేశమే. నాడు బీసీ సబ్ ప్లాన్ తెచ్చాం…బీసీ జనగణన కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా బీసీల అభ్యున్నతికి కృషి చేసేందుకు పునరంకితమవుతోంది తెలుగుదేశం” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్