Monday, February 24, 2025
HomeTrending Newsమాటలు కోతలు దాటుతున్నాయి...: బాబు వ్యంగ్యం

మాటలు కోతలు దాటుతున్నాయి…: బాబు వ్యంగ్యం

వైఎస్ జగన్ పాలను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రం సంధించారు. రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోతలు దాటుతున్నాయని, కానీ ప్రజలు రోడ్డు దాట లేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి వి. మురళీధరన్ ఇటీవల అనకాపల్లిలో పర్యటించారు. అక్కడి  రోడ్ల పరిస్థితిపై ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. “అనకాపల్లిలో దుర్భర స్థితిలో ఉన్న ఈ రోడ్లను చూడండి. ఇదేనా వైఎస్ జగన్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా? ఈ రోడ్లపై ప్రయాణించడం శిక్ష లాంటిది.  అనకాపల్లి నుంచి అచ్యుతాపురం 20కిలోమీటర్ల ప్రయాణానికి గంటకు పైగా పట్టింది” అంటూ పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేస్తూ “ వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు. అయితే ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో… బెస్ట్ రిజల్ట్ చూసో కాదు. ఎపిలో మూడున్నరేళ్లుగా ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి… వైసిపి ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ… ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్