జగన్ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి ఈరోజు కుప్పం నుంచే నాంది పలుకుతున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు అన్నంపెట్టే అన్నా క్యాంటిన్ పైనే దాడిగి తెగబడి ధ్వంసం చేసిన ఈ రోజు కుప్పం చరిత్రలో నేడు చీకటి రోజని అభివర్ణించారు. నేటి ఉదయం నుంచి కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలను నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. అనంతరం టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకండా పోయిందని, వీధికో రౌడీని వైసీపీ తయారుచేసిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారా? తాను తల్చుకుంటే 2 నిమిషాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తల సంగతి తెలుస్తానని, జగన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకతను జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నాపైనే దాడి జరిగితే ఇక ప్రజల పరిస్థితి ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది మమ్మల్ని కొట్టించడానికేనా అని నిలదీశారు. గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఇలాంటి వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసుల గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎస్పీ ఎక్కడున్నారని అడిగారు. తాను అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను సరైన దారిలో పెడతామన్నారు.
తమ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, ఈ విషయం పోలీసుల గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులు తప్పుకుంటే 2నిమిశాల్లో వైసీపీ గూండాల సంగతేంటో తెలుస్తానని సవాల్ విసిరారు. ఏ క్యాంటిన్ మీద అయితే దాడి చేశారో అదే ప్రదేశంలో ప్రారంభిస్తున్నానని ఎవరు అడ్డుకుంటారో రావాలని ఛాలెంజ్ చేశారు. అప్పటికప్పుడు వండిన అన్నం తెప్పించి అదే ప్రదేశంలో పార్టీ కార్యకర్తలకు వడ్డించారు.
Also Read : ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని