Sunday, January 19, 2025
HomeTrending Newsపెద్దిరెడ్డిని వదలను : చంద్రబాబు

పెద్దిరెడ్డిని వదలను : చంద్రబాబు

సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లాలుగా కరీంనగర్, చిత్తూరు జిల్లాలు ఉండేవని… అలాంటి చిత్తూరు జిల్లాలో పుట్టిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు రాష్ట్రానికే భారమయ్యాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రైతులు మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, పైగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారంటూ చెబుతున్నారని విమర్శించారు. గతంలో అయన హత్యా రాజకీయాలను తాను చూసీ చూడనట్లు వదిలేశానని… అందుకే ఈరోజు ఇలా తయారయ్యాడని అన్నారు.

]

‘నీ హత్యా రాజకీయాలను పాతిపెడతా’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.  ఏ నాయకుడైనా అరాచకాలు చేస్తే వారి గుండెల్లో నిద్రపోతానని స్పష్టం చేశారు. పండుగనాడు తమ పార్టీ కార్యకర్తలను పెద్దిరెడ్డి జైల్లో పెట్టించాడని,భవిష్యత్ లో ఎక్కడ ఉంటారో ఊహించుకోవాలని, ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకువస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకూ తన సున్నితత్వం చూశారని, ఇకపై  కఠినాన్ని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. వడ్డీతో సహా అంతా చెల్లిస్తానని చెప్పారు.

కాగా భోగి పండుగ సందర్భంగా నారావారి పల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నంబర్ 1ను మంటల్లో వేసి దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం నేతలు ఈ జీవోను భోగి మంటల్లో వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్