Sunday, January 19, 2025
HomeTrending Newsఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం

ఉత్తరప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వచ్చే నెల ఏడో తేదిన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అయోధ్య నుంచి జూలై 23 న బిఎస్పి అధ్వర్యంలో ప్రబుద్ధ సమ్మేలన్ ప్రారంభించారు. పార్టీ సీనియర్ నేత సతీష్ చంద్ర మిశ్ర నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65 జిల్లాల్లో సమ్మేలన్ కొనసాగింది. బ్రాహ్మణులను ఐక్యం చేసేందుకు చేపట్టిన ఈ యాత్ర మిగతా జిల్లాలు పూర్తిచేసుకొని 75 వ జిల్లాగా లక్నోలో ముగింపు కార్యక్రమం ఏడో తేదిన నిర్వహిస్తున్నారు.

ప్రబుద్ధ సమ్మేలన్ లక్నో సభలో మాయావతి ఎన్నికల నగారా మోగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 13 శాతం ఉన్న బ్రాహ్మణులు యోగి ఆదిత్యనాథ్ పాలనలో అనేక కడగండ్లు ఎదుర్కొంటున్నారని బిఎస్పి సీనియర్ నేత సతీష్ చంద్ర మిశ్ర ఆరోపించారు. రాష్ట్రంలో మూడు కోట్ల బ్రాహ్మణులు ఉన్నారని, వారందరూ ఈ దఫా ఏకతాటి మీదకు రాబోతున్నారని సతీష్ చంద్ర పేర్కొన్నారు. బ్రాహ్మణులు, దళితులు ఒక్కటైతే 50 శాతం ఓట్లు ఏకపక్షంగా ఏనుగు గుర్తుకు దక్కుతాయని, 2007 ఎన్నికలు మళ్ళీ పునరావృతమవుతుందని సతీష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. మాయావతి ముఖ్యమంత్రి అవుతేనే బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని, పరిపాలనలో తగిన వాటా ఉంటుందన్నారు.

జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ప్రతి రెండు రోజులకు ఉత్తరప్రదేశ్ లో మహిళలపై దాడులు జరగుతున్నాయని బిఎస్పి నేత సతీష్ చంద్ర మిశ్ర మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో మహిళలపై అత్యాచారం, హత్య ఘటనలతో ఉత్తరప్రదేశ్ ప్రతిష్ట దిగాజారిందన్నారు.

అటు బహుజన్ సమాజ్ పార్టీ కి చెందిన ఇద్దరు నేతలు ఈ రోజు సమాజ్ వాది పార్టీలో చేరారు. గ్యాంగ్ స్టార్, రాజకీయనేత ముక్తార్ అన్సారి ఆయన సోదరుడు సిగ్బతుల్ల తో కలిసి ఎస్పి జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో సీనియర్ నేత అంబిక చౌదరి కూడ ఎస్పి లో చేరారు. నేతల రాకతో పూర్వాంచల్ లో పార్టీ మరింత బలోపెతమవుతుందని అఖిలేష్ అన్నారు.

మరోవైపు కమలం పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం తీసుకొస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్