ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 84 పరుగులకు 5 వికెట్ల వద్ద నేటి మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ లో జానీ బెయిర్ స్టో సెంచరీ (106)తో జట్టును ఆదుకున్నాడు. జో రూట్-31; బిల్లింగ్స్-36; స్టోక్స్-25; చివర్లో మ్యాటీ పాట్స్-19 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇండియా బౌలర్లలో సిరాజ్ 4; బుమ్రా-3, షమీ-2; శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా జట్టు స్కోరు 4 వద్ద ఓపెనర్ శుభమన్ గిల్ (4) వికెట్ కోల్పోయింది. హనుమ విహారీ-11; విరాట్ కోహ్లీ-20 పరుగులు చేసి ఔటయ్యారు. 75 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో మరో ఓపెనర్ పుజారా, రిషభ్ పంత్ లు నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి పుజారా-50; పంత్ -30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, బ్రాడ్ లకు తలా ఒక వికెట్ దక్కింది.