Saturday, January 18, 2025
HomeUncategorizedడిసెంబర్ లోనే బాలయ్య మూవీ వచ్చే ఛాన్స్?

డిసెంబర్ లోనే బాలయ్య మూవీ వచ్చే ఛాన్స్?

బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన చేస్తున్న 109వ సినిమాపైనే ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదులుతున్న అప్ డేట్స్ ఈ ప్రాజెక్టుపై మరింతగా అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండనుంది అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.

బాలకృష్ణకి సంక్రాంతి పండుగ సెంటిమెంట్ ఉంది. అలాగే దసరా పండుగ సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో ఈ పండుగ సమయాల్లో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను సాధించిన సందర్భాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమా దాదాపుగా దసరాకి రావొచ్చునని అనుకున్నారు. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి రావడం ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే ఈ రెండు పండుగల సమయంలో ఎన్ని సినిమాలు విడుదలైనా థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తూనే ఉంటుంది.

పెద్ద సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ను ఇచ్చే పండుగలు ఇవి. అందువలన ఈ రెండు పండుగలలో ఏదో ఒకటి బాలయ్య ఎంచుకోవచ్చునని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ లోనే రిలీజ్ అనే ఒక టాక్ షికారు చేస్తోంది. గతంలో బాలయ్య చేసిన ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీన విడుదలై, సంచలనాన్ని సృష్టించింది. అందువలన అదే నెలలో ఈ సినిమాను వదిలితే బాగుంటుందనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా సమాచారం. ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్