Saturday, January 18, 2025
Homeసినిమాఅబ్బాయ్, బాబాయ్ వ‌చ్చేది ఎప్పుడు..?

అబ్బాయ్, బాబాయ్ వ‌చ్చేది ఎప్పుడు..?

మ‌లినేని గోపీచంద్ తో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు.  ‘మైత్రీ మూవీ మేక‌ర్స్’ దీన్ని నిర్మిస్తోంది.  ప్ర‌స్తుతం ట‌ర్కీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ దాదాపు పూర్త‌వుతుంది. టైటిల్ ఏంటనేది  త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే..  అఖండ రిలీజ్ డేట్ అయిన డిసెంబ‌ర్ 2న ఈ సినిమాని  కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న కుద‌ర‌డం లేద‌ట‌. అందుచేత సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ‌కు బాలయ్య చెప్పిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

బాబాయ్ బాల‌య్య సంక్రాంతికి రావాలి అనుకుంటుంటే… అబ్బాయ్  క‌ళ్యాణ్ రామ్ డిసెంబ‌ర్ లో రావాలి అనుకుంటున్నాడ‌ట‌. మైత్రీ మూవీ మేకేర్స్ బ్యాన‌ర్ లోనే క‌ళ్యాణ్ రామ్ సినిమా చేశాడు. డెవిల్ టైటిల్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాని డిసెంబ‌ర్ విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి డిసెంబ‌ర్ లో అబ్బాయ్.. జ‌న‌వ‌రిలో బాబాయ్ థియేట‌ర్లో సంద‌డి చేయ‌నున్నారు. మ‌రి… ఈసారి ఈ నంద‌మూరి హీరోలు ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: క‌ళ్యాణ్ రామ్ మూవీలో భారీ మార్పులు చేర్పులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్