Sunday, September 8, 2024
Homeసినిమామోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్. ప్లాన్ బయటపెట్టిన బాలయ్య

మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్. ప్లాన్ బయటపెట్టిన బాలయ్య

బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు..? ఎవరి డైరెక్షన్ లో అనేది మాత్రం క్లారిటీ లేదు. మోక్షజ్ఞ సినిమా గురించి అడిగిన ప్రతిసారీ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అని బాలయ్య చెప్పేవారు కానీ.. లాంచింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఆమధ్య బాగా లావుగా కనిపించిన మోక్షజ్ఞను చూసి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు అనుకుంట.. అందుకే అంత లావుగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు అనే కామెంట్లు వినిపించాయి.

ఇటీవల మోక్షజ్ఞ బాగా స్లిమ్ అయి కనిపించి అందర్నీ సర్ ఫ్రైజ్ చేశాడు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ అనేది మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే.. బాలయ్య తానా వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆఫ్ ది రికార్డ్ సన్నిహితులతో ఓ విషయం చెప్పారట. ఇంతకీ ఏం చెప్పారంటే.. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పారట. ఈ సినిమాలో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ నటిస్తాడని తెలియచేశారట. మరి.. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటే.. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని చెప్పారని తెలిసింది.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు కానీ… పూర్తి స్థాయి హీరోగా సినిమా చేయచ్చు కదా. బాలయ్య సినిమాలో కీలక పాత్ర చేయించడం ఏంటి అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలి అనుకున్నారు కానీ.. బాలయ్య డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి.. దర్శకత్వం బాలయ్యే చేస్తారో..? సింగీతం శ్రీనివాసరావుతో చేయిస్తారో..? మోక్షజ్ఞ పూర్తి స్థాయిలో హీరోగా నటించే సినిమా ఎప్పుడో తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్