నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రాయలసీమలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న టైమ్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగష్టు 1 నుంచి షూటింగులు ఆపేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఎక్కడ షూటింగులు అక్కడే ఆగిపోయాయి. పది రోజులు దాటినా ఇంకా షూటింగులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో క్లారిటీ లేదు.
అయితే.. బాలయ్య మూవీని ఈ నెల 15 నుంచి విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇంకా షూటింగుల పై క్లారిటీ రాకపోవడంతో విదేశాల్లో ప్లాన్ చేసిన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారట. అయితే.. షూటింగులు ఆపడంపై బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ సర్థిచెప్పడంతో షూటింగ్ వాయిదా వేయడానికి ఒప్పుకున్నారట కానీ.. అసలు షూటింగులు ఆపేయడం ఏంటి అంటూ సీరియస్ అయ్యారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
మరి.. ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..? విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. ఈ నెల 24 నుంచి అని టాక్ వినిపిస్తోంది. అప్పటిలోగా ఫిలిం ఛాంబర్ షూటింగులు చేసుకునేలా నిర్ణయం ప్రకటిస్తే సరే.. లేకపోతో ఫిలిం ఛాంబర్ తో సంబంధం లేకుండా షూటింగ్ చేయాలని నిర్మాతలకు చెప్పారట బాలయ్య. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ సరే అని చెప్పడంతో బాలయ్య కూల్ అయ్యారని తెలిసింది.
Also Read : షూటింగ్స్ బంద్ పై బాలయ్య అసహనం