Saturday, January 18, 2025
Homeసినిమా'ఊర్వశివో రాక్షసివో' చీఫ్ గెస్ట్ గా బాలయ్య

‘ఊర్వశివో రాక్షసివో’ చీఫ్ గెస్ట్ గా బాలయ్య

నందమూరి ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటిదో. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మధ్య మంచి అనుబంధం ఉండేది. అది అలా కంటిన్యూ అవుతుంది. ఆమధ్య అల్లు అర్జున్ ఫంక్షన్ కి బాలయ్య గెస్ట్ గా రావడం.. బాలయ్య ఫంక్షన్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం తెలిసిందే. అలాగే బాలయ్య అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్నారు. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్ 2’ అంటూ సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. ఇలా నందమూరి ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో‘. ఈ చిత్రానికి యువ దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా జిఏ 2 పిక్చర్స్ పై యువనిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ మంచి రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే.. ఊర్వశివో రాక్షసీవో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 30న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ విచేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని నవంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బాలయ్య ఈ మూవీ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తుండడంతో ఊర్వశివో రాక్షసివో సినిమా పై ఆడియన్స్ లో మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. మరి.. బాలయ్య ప్రచారం ప్లస్ అయి అల్లు శిరీష్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్