Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య 'భగవంత్ కేసరి' స్టోరీ ఇదే..?

బాలయ్య ‘భగవంత్ కేసరి’ స్టోరీ ఇదే..?

నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహా రెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బాలయ్య పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది.

ఇదిలా ఉంటే.. భగవంత్ కేసరి చిత్రాన్ని బాలీవుడ్ మూవీ ఖుదాగవా స్పూర్తితో రాసుకున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఖుదాగవా కథనే కొద్దిగా మార్చి తీస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఖుదాగవా సినిమాలో అమితాబ్, నాగార్జున, శ్రీదేవి నటించారు. కథ విషయానికి వస్తే… ప్రేయసికిచ్చిన మాట కోసం శత్రువుని చంపిన అమితాబ్ బచ్చన్ మరో ప్రాణ స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇతనెవరో తెలియకుండానే కూతురు ఇంకో చోట పెరిగి పెద్దవుతుంది. బయటికొచ్చాక ఆమెను కాపాడటమే పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ పాత్రను శ్రీదేవి చేసింది.

ఈ రెండు పాత్రల్లో బాలయ్య, శ్రీలీల కనిపిస్తారట. నిజమో కాదో తెలియదు కానీ బాలకృష్ణ జైలుకు వెళ్లే ఎపిసోడ్స్, బయటికి వచ్చాక అడుగడుగునా శత్రువులతో ఫైట్ చేసే సన్నివేశాలు దగ్గరి పోలికనైతే చూపిస్తున్నాయి. అప్పట్లో ఇది పెద్ద హిట్టు. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. తెలుగులో కొండవీటి సింహంగా డబ్బింగ్ చేశారు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై అనిల్ రావిపూడి ఏమంటాడో చూడాలి. ఇక భగవంత్ కేసరి చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్