Saturday, November 23, 2024
Homeసినిమాకృష్ణవంశీతో బాలయ్య 110వ చిత్రం

కృష్ణవంశీతో బాలయ్య 110వ చిత్రం

Raithu: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రానికి క్రిస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విజ‌యం సాధించింది. అయితే.. బాల‌య్య 100వ చిత్రంగా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్ లో రైతు అనే సినిమా చేయాలి అనుకున్నారు. ఆ కథకి క్రియేటివ్ మేకర్ కృష్ణవంశీ అయితేనే న్యాయం చేయగలరని  పిలిపించి మరీ తానే డైరెక్ట్ చేయాలని కోరార‌ట‌. బాల‌య్య అడ‌గ‌డంతో కృష్ణ‌వంశీ ఓకే చెప్పార‌ట‌.

అయితే.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రని బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ పోషించాల్సి ఉంది. ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆయన కాల్షీట్ల  సమస్య రావడం  ప్రాజెక్ట్ ఆగిపోవడానికి  ఓ కారణంగా అప్పట్లోనే  తెర పైకి వచ్చింది. అలా ఆ కాంబినేషన్ లో సినిమా ఇంత వరకూ సాధ్యపడలేదు. అయితే.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో రైతు ఆగిపోవ‌డానికి కార‌ణం ఏంటి అనేది కృష్ణ‌వంశీ చెప్పారు.

ఇదిలా ఉంటే… 100 నుంచి 106 వరకూ బాలయ్య ఎంతో  వేగంగా సినిమాలు చేసుకుంటూ వచ్చేసారు. దీంతో 110వ సినిమా కూడా దగ్గర పడింది. ప్రస్తుతం 107వ ప్రాజెక్ట్ కి  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్నారు. అటుపై 108వ చిత్రం యంగ్ మేకర్ అనీల్ రావిపూడితో ఇప్పటికే  ఖరారైంది. మధ్యలో 109 ఒకటుంది. అటుపై 110వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంతగానే భావించాలి. ఈ నేపథ్యంలో మరోసారి రైతు తెరపైకి వచ్చింది. బాల‌య్య 110వ చిత్రంగా రైతు రావ‌చ్చు అని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. బాల‌య్య‌, కృష్ణ‌వంశీ కాంబినేష‌న్లో రైతు ఈసారైనా సెట్ అవుతుందేమో చూడాలి.

Also Read : ‘సిందూరం’ అప్పులపాలు  చేసింది: కృష్ణవంశీ  

RELATED ARTICLES

Most Popular

న్యూస్