Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్యతో బాబీ మూవీ?

బాల‌య్యతో బాబీ మూవీ?

నంద‌మూరి బాల‌కృష్ణ ‘అఖండ’ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ట‌ర్కీలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.  దీని తర్వాత అనిల్ రావిపూడితో బాల‌య్య ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా మరో ప్రాజెక్ట్ కు బాల‌య్య ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ.. కొత్త ప్రాజెక్ట్ ఎవ‌రితో అంటే.. డైరెక్ట‌ర్ బాబీతో అని స‌మాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో బాలయ్య సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. బాబీ ప్రస్తుతం చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ అనే కమర్షియల్ ఎంటర్ టైన‌ర్ ను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

వాల్తేరు వీర‌య్య‌ కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య సినిమా పై బాబీ దృష్టి సారించనున్నారు. అయితే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా ఉండొచ్చని ఈ మధ్య ఊహాగానాలు వినిపించాయి. పైసా వసూల్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పుకున్నారు. అయితే.. పూరి క‌న్నా ముందు బాబీతో బాల‌య్య‌ సినిమా ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. మ‌రి.. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో అఖండ 2? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్