Monday, February 24, 2025
Homeసినిమాబాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్ మెంట్

బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్ మెంట్

Movie Ok:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అనౌన్స్ చేస్తార‌ని అనుకున్న‌ట్టుగానే ఈ మూవీని  ప్ర‌క‌టించారు. ఇవాళ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.

గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈసారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అంతే కాకుండా బాల‌య్య‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా చేస్తుండ‌డంతో ఈ మూవీ ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డుతున్నారు.

Also Read : బ్రో..ఐ డోంట్ కేర్ అంటున్న బాల‌య్య‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్