Saturday, January 18, 2025
Homeసినిమాబ్రో..ఐ డోంట్ కేర్ అంటున్న బాల‌య్య‌

బ్రో..ఐ డోంట్ కేర్ అంటున్న బాల‌య్య‌

I am Balayya:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంద‌ని గ‌త కొన్నిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప‌టాస్ నుంచి ఎఫ్ 3 వ‌ర‌కు వ‌రుస‌గా స‌క్సెస్ సాధిస్తోన్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రీసెంట్ గా ఎఫ్ 3 సక్సెస్ సాధించ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో బాల‌య్య‌తో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు.

సెప్టెంబర్ చివరి నుంచి బాలయ్య రెడీ. నాలుగు నెలల్లో షూట్ కంప్లీట్ చేయాల‌నేది ప్లాన్. ఇక ఈ చిత్రాన్ని ప్రీ సమ్మర్ లో విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి. అదే.. ‘బ్రో..ఐ డోంట్ కేర్’. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు, యాటిట్యూడ్ కు .. ఐ డోంట్ కేర్.. అనే టైటిల్ పక్కాగా సరిపోతుంది. ఈ టైటిల్ కి బాల‌య్య కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేశార‌ని తెలిసింది.

ఈ సినిమాలో బాలయ్య కూతురుగా పెళ్లిసంద‌డి ఫేమ్ శ్రీలీల నటిస్తోంది. బాలయ్య సరసన ఓ మాజీ హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో అది కూడా ఫైనల్ చేస్తారు. పటాస్ మాదిరిగా మాంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మ‌రి.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాల‌య్య ఎంత వ‌ర‌కు మెప్పిస్తారో చూడాలి.

Also Read : ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదు : బాల‌కృష్ణ‌ టీమ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్