Wednesday, June 17, 2026
HomeసినిమాNandamuri Balakrishna: కాళీమాత భక్తుడుగా బాలయ్య?

Nandamuri Balakrishna: కాళీమాత భక్తుడుగా బాలయ్య?

నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో  రెండు వరుస బ్లాక్ బస్టర్స్ సాధించారు.  దీంతో బాలయ్య నెక్ట్స్ మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి  దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు.  హీరోయిన్ గా కాజల్ అగర్వాల్,  బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం లేకుండా వరుస సక్సెస్ సాధిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బాలయ్య ఈ సినిమాలో కాళీమాత భక్తుడుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కాళీమాత ఉండడంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమే అనిపిస్తుంది.  కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలిసింది. బాలయ్య తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెప్పబోతుండడం విశేషం.

ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా  ఉంటూనే… మరో వైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. అంటే… అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అన్నమాట. అలాగే సినిమాలో ఫాదర్ – డాటర్ మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular