Tuesday, June 16, 2026
HomeసినిమాAkhil- Srikanth: అఖిల్ తో దసరా డైరెక్టర్ మూవీ?

Akhil- Srikanth: అఖిల్ తో దసరా డైరెక్టర్ మూవీ?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ కొట్టాలని అఖిల్ కసితో వర్క్ చేశాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏజెంట్ మూవీ పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మూవీ పై మరింత క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ లో స్పీడు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు. అయితే.. దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెలతో అఖిల్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలోని సింగరేణి గనుల నేపథ్యంలో వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే ఒక కథగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. రికార్డు కలెక్షన్స్ తో దసరా చిత్రం దూసుకెళుతుండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. శ్రీకాంత్ తో సినిమాలు చేసేందుకు బడా ప్రొడ్యూసర్స్ అండ్ స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ సాధించిన అఖిల్ ఈ నెల 28న ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ కు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫుల్ స్టోరీ చెబుతాడని తెలిసింది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే అఖిల్ కు చెప్పిన కథ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

Also Read : అఖిల్ ఏజెంట్ అసలు వస్తుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular