9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeసినిమాNaga Chaitanya: చైతు గురించి అసలు విషయం బయటపెట్టిన దక్షా

Naga Chaitanya: చైతు గురించి అసలు విషయం బయటపెట్టిన దక్షా

అక్కినేని నాగచైతన్య ‘థ్యాంక్యూ’తో డీలా పడినా ‘బంగార్రాజు’ సినిమాతో సక్సెస్ సాధించారు. అయితే.. బంగార్రాజు మూవీ ఈవెంట్ లో నాగచైతన్య, దక్షా నగార్కర్ మధ్య జరిగిన చూపుల భాష తెగ వైరల్ అయ్యింది. అంతే కాకుండా దక్షా కు మంచి గుర్తింపు కూడా తెచ్చింది. ఆ టైమ్ లో చైతూ-దక్షా మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందంటూ ప్రచారం జరిగింది. అంతా నిజమేనేమో అనుకున్నారు. దీనిపై వారిద్దరూ స్పందించలేదు. ఇప్పుడు నాగచైతన్య పై దక్షా చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.

‘నాగచైతన్య స్వీట్ బాయ్. అందుచేత అలాంటి స్వీట్ బాయ్ ను ఏ అమ్మాయి అయినా తన లైఫ్ లో కోరుకుంటుంద’ని చెప్పింది. “చైతూ చాలా కూల్ అండ్ స్మార్ట్. అతడు అమ్మాయిల పై చాలా కేర్ చూపిస్తాడు. దాన్ని నేను ఫీల్ అయ్యాను. షూటింగ్ లో ముద్దు పెట్టుకునే సీన్లు, కౌగిలించుకునే సన్నివేశాలు పడ్డాయి. ఆ సీన్స్ చేసిన తర్వాత నాగచైతన్య నాకు సారీ చెప్పాడు. అంత స్వీట్ అబ్బాయి చైతూ” అంటూ తనపై ఉన్న అభిమానాన్నిబైటపెట్టింది.

అయితే బంగార్రాజు ఫంక్షన్ లో కొంటె సైగలపై మాత్రం స్పందించలేదు. చైతూతో నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు  ఆ మేటర్ బైట పెడతానంటూ తప్పించుకుంది.  దక్షా ‘రావణాసుర’లో నటించింది. నాగచైతన్య ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి.. దక్షా గురించి నాగచైతన్యను అడిగితే.. ఏం చెబుతారో?

Also Read : Custody: నాగచైతన్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్