Saturday, January 18, 2025
Homeసినిమామైత్రీ మూవీ పై ఒత్తిడి పెంచెతున్న బాలయ్య ఫ్యాన్స్

మైత్రీ మూవీ పై ఒత్తిడి పెంచెతున్న బాలయ్య ఫ్యాన్స్

చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటిస్తున్న మూవీ ‘వీరసింహారెడ్డి‘. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయి. చిరు, బాలయ్య ఇలా సంక్రాంతికి పోటీపడుతుండడంతో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది..? ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో కథానాయికగా శృతి హాసన్ నటిస్తుండడం ఓ విశేషమైతే.. ఈ రెండు భారీ చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ కూడా ఒకటే కావడం విశేషం.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు చిత్రాల్ని నిర్మిస్తుంది. బాలయ్య సినిమాను డిసెంబర్ లో, చిరంజీవి సినిమాను జనవరిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. బాలయ్య సినిమా అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో జనవరిలో రిలీజ్ చేయాల్సివచ్చింది. అయితే.. ఇప్పుడు సంక్రాంతికి ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయాల్సి రావడంతో మైత్రీ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా ఒకే నిర్మాత నిర్మించిన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఎప్పుడూ జరగలేదు. ఇలా రెండు పెద్ద సినిమాలని ఒకేసారి తీసుకురావడం అంత తేలిక కాదు.

ఇద్దరు పెద్ద హీరోలే. వారు కోరుకున్న థియేటర్లు సమానంగా దొరకడం సాధ్యం కాకపోవచ్చు. అలాగే ప్రమోషన్స్ ని కూడా చూసుకోవాలి. ఈ విషయంలో అప్పుడే మైత్రీ మూవీ మేకర్స్ కి నందమూరి ఫ్యాన్స్ నుండి సెగ మొదలైయింది. వీరయ్య ఫస్ట్ సింగల్ వచ్చేసింది. బాస్ పార్టీ అంటూ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. దీంతో వీరసింహారెడ్డి అప్డేట్స్ ఎక్కడ అంటూ ‘మైత్రీ మూవీ మేకర్స్’పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిజానికి రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేయడం మైత్రీ మూవీ మేకర్స్ కీ కష్టమే కానీ తప్పని పరిస్థితిలో తప్పక విడుదల చేస్తున్నారు. మరి.. మైత్రీ సంస్థ ఎలా డీల్ చేస్తుందో..?  చూడాలి.

Also Read : ‘వీరసింహారెడ్డి’ స్టోరీ ఇదేనా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్