Sunday, January 19, 2025
Homeసినిమామోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు అనేది మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్యను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగిన ప్రతిసారీ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అనేవారు. అయితే.. మోక్షజ్ఞ ఫిజిక్ పై కాన్ సన్ ట్రేషన్ చేయకపోవడం.. బాగా లావుగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో అసలు మోక్షజ్ఞకు సినిమాల పై ఇంట్రస్ట్ ఉందా..?  హీరోగా ఎంట్రీ ఉంటుందా..?  ఉండదా..? అనే అనుమానాలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే.. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘అఖండ’ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య, బోయపాటి,నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్యను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగారు. దీనికి బాలయ్య వచ్చే సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. మరి.. సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి డైరెక్షన్ లో ఉంటుందా..? ఎవరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అడిగితే.. ఆ దేవుడు నిర్ణయిస్తాడని చెప్పారు బాలయ్య. మరి.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరి డైరెక్షన్ లో ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్