Sunday, January 19, 2025
Homeసినిమా'హిట్ 2' గురించి బాలయ్య, మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

‘హిట్ 2’ గురించి బాలయ్య, మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

యంగ్ హీరో అడివి శేష్. తాజాగా ‘హిట్‘ మూవీ సీక్వెల్ లో నటించాడు. ఇందులో అడివి శేష్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించింది.  శైలేష్ కొలను డైరెక్షన్ లో రూపొందిన ‘హిట్ 2’ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఫస్ట్ వీక్ లోనే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది.

తాజాగా నట సింహం నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞతో కలిసి హిట్ 2 చిత్రాన్ని ప్రత్యేక షో లో చూడటం జరిగింది. సినిమాను బాగా ఎంజాయ్ చేసిన బాలకృష్ణ టీమ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. మూవీ చాలా బాగుంది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. అల్టిమేట్ థ్రిల్లర్ అని బాలయ్య చెప్పడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణను హిట్‌ యూనివర్స్‌లో భాగం చేయమని శేష్ ఒక జోక్ చేసాడు. శేష్ వ్యాఖ్యలకు స్మైల్ ఇచ్చారు కానీ.. బాలకృష్ణ, నో చెప్పలేదు.

దీంతో బాలకృష్ణ హిట్ యూనివర్స్ లో భాగమైతే బావుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరో వైపు మహేష్‌ బాబు కూడా అడివి శేష్ కు ఫోన్ చేసి హిట్ 2 సక్సెస్ అవ్వడంతో అభినందించారు. మహేష్‌ అలా మాట్లాడుతుంటే… తన కళ్లంట నీళ్లు వచ్చాయని అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. మహేష్‌ అభిమానులు కూడా హిట్ యూనివర్స్ లో మహేష్ కూడా ఉంటే బాగుంటుంది అంటున్నారు. మరి.. బాలయ్య కానీ.. మహేష్‌ కానీ హిట్ యూనివర్స్ లోకి వస్తారేమో చూడాలి.

Also Read :  పాత ఫార్మేట్ ను పట్టుకుని వెళ్లిన ‘హిట్ 2’   

RELATED ARTICLES

Most Popular

న్యూస్