Saturday, January 18, 2025
Homeసినిమాడిసెంబర్ లో 'బాల‌య్య 107' రిలీజ్

డిసెంబర్ లో ‘బాల‌య్య 107’ రిలీజ్

In December: నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన ‘అఖండ’ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో నెక్ట్స్ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ‘క్రాక్’ తో స‌క్సెస్ సాధించిన మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో బాల‌య్య భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఇందులో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తార‌ట‌. ఫస్ట్ హాఫ్ లో రెండు లోకల్ ఫైట్స్, ఒక ఫారిన్ ఫైట్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది అనేలా ఉంటుంద‌ట‌. అలానే సెకండ్ హాఫ్ లో అయితే… మరింతగా ఆకట్టుకునే భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల టీజ‌ర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా రిలీజ్ ప్లాన్ మారింద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి.. అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బాల‌య్య ఈ మూవీతో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : బాల‌య్య షోలో మెగాస్టార్. అభిమానుల‌కు పండ‌గే

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్