Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.?

బాల‌య్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.?

బాల‌కృష్ణ‌, మ‌లినేని గోపీచంద్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ నటిస్తోంది.  ఆమ‌ధ్య బాల‌య్యపై రాయ‌ల‌సీమ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ తో  షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది.  బాల‌య్య‌కు క‌రోనా,  ఆ త‌ర్వాత షూటింగులు ఆపేయ‌డం వ‌ల‌న సినిమాకు బ్రేక్ ప‌డింది.  తాజాగా ఫారిన్ షెడ్యూల్ మొదలైంది.

తొలుత ఈ సినిమాను ద‌స‌రాకి రిలీజ్ చేయాలనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుద‌రడం లేదు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్ర‌స్తుతం విదేశాల్లో బాల‌య్య పై కీల‌క స‌న్నివేశాల‌ను ఓ సాంగ్ ను చిత్రీక‌రిస్తున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. అఖండ సినిమా డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేయాలనుకున్నా,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తగిన సమయం కావాల్సి ఉండడంతో డిసెంబ‌ర్ 23న ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తార‌ని తెలిసింది.

Also Read : బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్