Thursday, October 3, 2024
Homeసినిమాబాల‌య్య‌, కొర‌టాల మూవీ నిజ‌మేనా?

బాల‌య్య‌, కొర‌టాల మూవీ నిజ‌మేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం 107 వ చిత్రాన్ని చేస్తున్నారు. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో వస్తోన్న ఈ సినిమాను డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడితో  చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత బాల‌య్య ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారనేది ప్ర‌క‌టించ‌లేదు.

కొర‌టాల శివ‌తో బాల‌య్య సినిమా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ లో ఈ సినిమా రానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆచార్య తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తో కొర‌టాల శివ చేయబోతున్న చిత్రం విషయంలో ఇంకా స‌స్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మేకర్స్ మాత్రం ఈ సినిమా పై సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్‌ తో ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య, కొరటాల సినిమా పట్టాలెక్కనుందని, ఈలోపు బాలయ్య కమిటైన రెండు చిత్రాలను పూర్తి చేసి రెడీగా ఉంటార‌నే టాక్ వినిపిస్తుంది. మరి.. ఈ వార్తల పై త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్