Sunday, January 19, 2025
Homeసినిమా‘అఖండ‌’కు అనూహ్య స్పంద‌న‌

‘అఖండ‌’కు అనూహ్య స్పంద‌న‌

Positive talk on Akhanda:
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొంద‌డం.. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అఖండ’పై అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో అఖండ సినిమాతో బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ సాధించ‌డం ఖాయ‌మ‌నే టాక్ వ‌చ్చింది. ఇక ఈరోజు అఖండ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ సినిమాలో బాల‌కృష్ణ న‌ట విశ్వ‌రూపం చూపించారు. ఆయ‌న‌ని త‌ప్ప.. ఇంకెవ‌ర్నీ ఆ పాత్ర‌లో ఊహించుకోలేం. యాక్ష‌న్ సీన్స్ లో అయితే.. నెక్ట్స్ లెవ‌ల్ అన్న‌ట్టుగా ఉంది. ముఖ్యంగా శివుడు పాత్ర‌లో అయితే.. బాల‌య్య న‌టించడం కాదు.. జీవించారు అని చెప్ప‌చ్చు అంటున్నారు. ఓవ‌ర్ సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోను ‘అఖండ‌’కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. దీంతో అనుకున్న‌ట్టుగానే బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ సాధించింది అంటూ నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

సామాన్యుల నుంచే కాకుండా సినీ ప్ర‌ముఖులు సైతం ‘అఖండ’పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నేచుర‌ల్ స్టార్ నాని, ఎన‌ర్జిటిక్ హీరో రామ్, ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి.. ఇలా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అఖండ టీమ్ కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Also Read : బసవతారకంలో అత్యాధునిక ఆక్సిజన్ కేంద్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్