Wednesday, March 26, 2025
HomeTrending Newsరిపీట్ అయితే... జాగ్రత్త: బాలినేని వార్నింగ్

రిపీట్ అయితే… జాగ్రత్త: బాలినేని వార్నింగ్

Warning: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత కారుపై టిడిపి నేతలు దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే టిడిపి నేతల కార్లు కాదు కదా ఏమీ మిగలవు అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

సాక్షాతూ హోం మంత్రి కారునే గుద్దడం ఏమాత్రం సబబని బాలినేని ప్రశ్నించారు.  తాను ఒంగోలులో టిడిపి నేతలను అడ్డుకోవడంలేదని,  తమ మంచితనాన్ని అలుసుగా తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని, చర్యకు తగ్గ ప్రతిచర్య ఉంటుదని వారు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. గతంలో కమ్మపాలెంలో తనను అడ్డుకున్నారని.. అధికారంలో ఉండి కూడా తాము పోలీసులను ఉపయోగించుకోవడం లేదన్నారు.

హోం మంత్రి కారుపై దాడి జరిగితే తనపై జరిగినట్లేనని, ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని, లేకపోతే వారి సంగతి తెలుస్తామంటూ టిడిపి నేతలకు గట్టి హెచ్చరిక పంపారు.

Also Read : బాధ్యతగా ప్రవర్తించాలి: మంత్రి సురేష్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్