Saturday, November 23, 2024
HomeTrending Newsపాపులర్‌ ఫ్రంట్‌ పై ఐదేళ్ళపాటు నిషేధం

పాపులర్‌ ఫ్రంట్‌ పై ఐదేళ్ళపాటు నిషేధం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐపై ఐదేండ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా బ్యాన్‌ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తుందన్న ఆరోపణల ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐపై ఎన్‌ఐఏ, ఈడీ వరుగా దాడులు నిర్వహించాయి. ఈనెల 22, 27 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లలో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 3 వందల మందికిపైగా పీఎఫ్‌ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. అదేవిధంగా పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా లభించిన కీలక పత్రాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. ప్రధానమంత్రితో సహా ఓ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులను హత్యచేసేందుకు, రాష్ట్రాల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీంతో పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలైన రిహబ్‌ ఇండి ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహబ్‌ ఫౌండేషన్‌ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.

Also Read : ఆరు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ సానుభూతిపరుల అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్