Thursday, January 23, 2025
HomeTrending NewsAmit Shah: పోరాట యోధుడు బండి - అమిత్ షా ప్రశంస

Amit Shah: పోరాట యోధుడు బండి – అమిత్ షా ప్రశంస

చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పోరాట యోధుడిగా అభివర్ణించారు. జిజారు (పోరాట యోధుడు, హీరో) ప్రదేశ్ అధ్యక్ష్ బండి సంజయ్ కుమార్ అంటూ సంబోధించిన అమిత్ షా తన ప్రసంగంలో పలుమార్లు సంజయ్ పేరును ప్రస్తావించారు.

సంజయ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా సభలో ఉన్నవారంతా చప్పట్లతో సంజయ్… సంజయ్ అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన అమిత్ షా బీజేపీ కార్యకర్తలు అరెస్టులు, జైళ్లకు భయపడబోరని స్పష్టం చేస్తూనే తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని సంకేతాలు పంపారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి అమిత్ షా గట్టి హెచ్చరికలు పంపారు.

బహిరంగ సభలో అడుగుపెడుతూనే బండి సంజయ్ భుజం తట్టి ప్రోత్సహించిన అమిత్ షా… వెళ్లేటప్పుడు భుజంపై చేయి వేసి వెన్నుతట్టారు. మరోవైపు సభలో బండి సంజయ్ ప్రసంగిస్తున్నంతసేపు సభకు హాజరైన వేలాది మంది జై బీజేపీ… జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు.

అమిత్ షా ప్రసంగం ముగిసిన అనంతరం చేవెళ్ల బహిరంగ సభను విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన మాజీ మంత్రి చంద్రశేఖర్ ను బండి సంజయ్ పరిచయం చేసి శాలువా అందించారు. వెంటనే చంద్రశేఖర్ ను అభినందిస్తూ శాలువాతో సన్మానిస్తూ చేయిపట్టి పైకెత్తి విజయ సంకేతం చూపారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పక్కనే ఉన్న మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పరిచయం చేయడంతో ఆయనను సైతం అమిత్ షా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్