Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

జీడిగింజ జీడిగింజ… సిగ్గులేదా? అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అని అన్నదంట.. కేసీఆర్ సంగతి కూడా అట్లనే ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మేం ఏం మాట్లాడుకున్నమో… ఈ పీకుడుగానికి ఏం తెలుసు అని ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.

బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడిన పూర్తి పాఠం వివరాలు…
మాకేం లేదా… ఏం లేనిదే.. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటమా? నీ లెక్క తాగి ఫాంహౌజ్ లో పడుకున్నమనుకుంటున్నవా? సీఎం స్థాయి వ్యక్తి కయల్ తప్పి అడ్డగోలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్ లో బొంద పెట్టిన సంగతి మర్చిపోయిండు… జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం. అమ్మవారిని పట్టుకుని ఈ అంబ… ఆ అంబని చులకనగా మాట్లాడుతవా? నీకు మూడింది.. దగ్గర పడింది… రాసేటోడికైనా సిగ్గుండాలె…
నువ్వు దేవుడిని తిడతవా?.. ధర్మాన్ని తిడతవా? ఎందుకు బతుకున్నవో అర్ధం కావడం లేదు…హిందువుల మనోభావాలను కించపర్చేలా మాట్లాడతవా? అదే నీ రాజకీయానికి సమాధి అవుతుంది గుర్తుంచుకో… వెంటనే ప్రజలకు క్షమాఫణ చెప్పాలి. ప్రధాని పదవిని గౌరవిస్తవా? యోగి ఆదిత్యనాథ్ ను కించపరుస్తవా? ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీసం పట్టుకోలేని నువ్వా యోగి గురించి మాట్లాడేది… అక్కడ తప్పు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చిన యోగి గురించి మాట్లాడతావా?
తెలంగాణ మొత్తం వరదలతో మునిగిపోతోంది… నువ్వు గతంలో ఏం జెప్పినవ్… ఇస్తాంబుల్, లండన్, న్యూయార్క్ అన్నవ్ కదా… ఏవి… జనం నిలదీస్తారని తెలిసే దారి మళ్లించే మాటలు మాట్లాడుతున్నడు. ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావు.. రైతులు నష్టపోతే బయటకు రావు.. నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బయటకు రాని నువ్వు దేశ్ కీ నేతట.. మోదీకి, ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే.. .నువ్వు ఫాంహౌజ్ నుండి బయటకే రావు..అధికారాన్ని విసిరికొడతవా?… చెప్పుతో సమానమంటవా? నీ అహంకారం తలకెక్కింది… ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని విసిరిపడేసే రోజులు దగ్గరపడుతున్నయ్… మోదీ విదేశాలు తిరిగి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నవ్… ఫాంహౌజ్ లో పడుకుని ఏ సీసాలో ఏ బ్రాండ్ మందు ఉందో తాగి పండుకుంటున్నవ్….ఎవరు గోకినా.. గోక్కున్నా నువ్వు గీకుతవా?… బహుశా గజ్జి ఉన్నట్లుంది. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.

నువ్వు దేశంలోని ప్రాజెక్టుల గురించి మాట్లాడతవా? నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడు దమ్ముంటే.. ఆర్డీఎస్ గురించి మాట్లాడు… కేసీఆర్ వంద సార్లు ఏక్ నాథ్ షిండే పేరు ప్రస్తావిస్తుండు… నీ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నరని తెలిసి భయపడుతున్నడు.. అందుకే టెన్షన్ పడి తెల్లారి లేస్తే షిండే గురించి మాట్లాడుతున్నడు… ఉంటదో పోతదో తెల్వని ప్రభుత్వం మీది. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నరు. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్ నాథ్ షిండేలు ఆలోచిస్తున్నరని తెలిసి ఆ పేరే తీస్తున్నవ్… మేం అధికారం కోసమే ఆలోచిస్తే… ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకుంటవ్? మాకు అక్కడ సీఎం అయ్యే అవకాశమే ఉండేది.. నువ్వు చేస్తే సంసారం… ఇతరులు చేస్తే వ్యభిచారమా?…
అసలు నువ్వు ఇక్కడేం చేసినవో చెప్పు? దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? రుణమాఫీ ఏమైంది? దళితులకు పది లక్షల సంగతేమైంది? ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? నీ పాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నరు? ముందు వీటికి సమాధానం చెప్పు? ఈయన ఆర్ధిక పరిస్థితి మీద మాట్లాడుతున్నడు… కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుపోతుంటే.. భారత్ ను ఆర్దికంగా పటిష్టంగా ఉంచిన ఘనత మోదీదే…
నువ్వు తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసినవ్… నువ్వా మోదీ గురించి మాట్లాడేది? పీయూష్ గోయల్ ను తిడతవా?

ఒకప్పుడు మోదీగారి గురించి ఏమన్నవో తెల్వదా? ఎట్లా పొగిడినవో తెల్వదా? (మోదీని పొగడ్తల్లో ముంచెత్తుతూ కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తూ…)
కళ్లు నీకు అప్పుడు దొబ్బినయా? ఇప్పుడు దొబ్బినయా? అప్పుడేమో మోదీగారిది నీతివంతమైన పాలన అని పొగుడుతావ్… ఇప్పుడేమో అవినీతి పాలన అంటావా? దమ్ముంటే… అవినీతి చూపించు. నాకు అధికారమిస్తే… మోడల్ తెలంగాణను దేశానికి చూపిస్తడట… ఏం చూపిస్తవ్.. తాగి ఫాంహౌజ్ లో పడుకున్నది చూపిస్తవా? నువ్వు, నీ కుటుంబం తెలంగాణను దోచుకున్న తీరును చూపిస్తవా? విజయ్ మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి మర్చిపోయినవా? 19 వేల 111 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 15 వేల 114 కోట్లను వాళ్లు ఆల్రెడీ చెల్లించారు. ఇంకా డబ్బులు కడతాం.. అరెస్ట్ చేయొద్దని దండం పెడుతూ బతిమాలుతున్న సంగతి గుర్తుంచుకో…
కేసీఆర్ అవినీతిపైన ప్రజల ద్రుష్టి పడకుండా చేస్తున్న పన్నాగమిది… నీకు మోదీ అంటే భయం.. ఆయన వస్తున్నడంటేనే గజగజ వణికిపోతున్నవ్. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే… చేతగాక.. దేశం గురించి మాట్లాడతవా? నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కాయిల్ తప్పి ఎందుకు మాట్లాడుతున్నవ్. సోడా కలిపిండ్రా లేదా? దేశాన్ని అభివ్రుద్ధి పథంలో నడుపుతున్న మోదీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నరు. నువ్వు నిర్వహిస్తున్న సర్వేల్లోనే నీ పార్టీ మొత్తం ఓడిపోతుందని.. నీ పనైపోయిందని అర్ధమై ప్రజల దారి మళ్లించడానికి అడ్డగోలుగా మాట్లాడతావా? దేశం ఎట్లా అభివ్రుద్ధి చెందుతుందో తెల్వకపోతే ఇదిగో పేపర్ (టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను చూపిస్తూ…)… అట్లాగే తెలంగాణ ఎట్లా దెబ్బతిన్నదో కూడా రాసింది. ఒక్కసారి చదువుకో.

సిగ్గు లేకుండా చైనా, పాకిస్తాన్, శ్రీలంకను పొగుడుతవా? దేశమ్మీద సీఎంకు అంత కక్ష ఎందుకు? నీకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలి. నువ్వు పక్క దేశాన్ని పొగుడుతవా?
పదవీ విరమణ చేసిన జడ్జీలు సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే మాకేం సంబంధం? నీ లెక్క సుప్రీంకోర్టును తిడతామనుకున్నవా? ఇదిగో నువ్వు సుప్రీంకోర్టును తిడుతూ చేసిన వ్యాఖ్యలివిగో.. (కేసీఆర్ మాట్లాడిన వీడియు చూపిస్తూ…). నువ్వు ఎప్పుడేం మాట్లాడుతున్నవో… నీకే అర్ధం కాని పరిస్థితి. నువ్వు పథకాల గురించి మాట్లాడతవా? మేం దేశ ప్రజలకు అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడితే ఒక రోజు సమయం కూడా సరిపోదు… ఆయుష్మాన్ భారత్, 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు, స్వచ్చ భారత్ వంటి ఎన్నో పథకాలున్నయ్. నీకు మోదీని చూస్తేనే కరోనా వస్తది. ప్రజల ద్రుష్టిని మళ్లించడానికే మోదీ గురించి మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలుసు. నీ మాటలను ఎవరూ నమ్మరు. నువ్వు అన్ని రకాల ఛార్జీలు పెంచినవ్.. కరెంట్ ఛార్జీలను 100 శాతం పెంచినవ్.. ఆర్టీసీ ఛార్జీలను ఐదుసార్లు పెంచినవ్. ఇప్పటికీ ఉద్యోగులకు సక్కగ జీతాలివ్వడం లేదు? రైతులు చస్తుంటే పట్టించుకోకుండా పంజాబ్ పోయి ఇక్కడి జనం సొమ్మును పంచుతున్నవ్. ఇప్పటికైనా హద్దుల్లో ఉండాలి… హద్దు మీరి మాట్లాడటం మానుకోవాలి. కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే.. ఆయనలో ఏదో భయం ఉన్నట్లుంది. ఆ పార్టీలో ఏక్ నాథ్ షిండేలున్నరు.
లక్ష్మణ్ గురించి మాట్లాడతవా? ఆయనకు రాజ్యసభ సీటిస్తే నీకెందుకు కళ్లమంట? ప్రధానిని, పీయుష్ గోయల్ ను, యోగి, లక్ష్మణ్ లను తిడుతున్నవ్… సోషల్ మీడియాలో నిన్ను తిట్టిన మాట్లాడిన మాటలు ఒక్కసారి చదువుకో. జీతాలియ్యడం లేదని ఆంధ్రజ్యోతి రాస్తే నీకెందుకు కడుపు మంట… జీతాలిచ్చినట్లు నీ బూతు పత్రిక, బూతు ఛానల్ రాస్తుంటే జనం నవ్వుకుంటున్నరు. ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాస్తే నీకు కడుపు మంట. అందుకే తిడుతున్నవ్. ఒకనాడు జర్నలిస్టులను బెదిరించి తిట్టిన కేసీఆర్.. ఇయాళ దండం పెట్టే స్థాయికి వచ్చిండంటే.. ఆ ఘనత బీజేపీదే. ఇయాళ స్కూళ్లలో చాక్ పీసుల్లేవు.. సౌకర్యాల్లేవు. తినడానికి తిండి లేదు.. దాని గురించి మాట్లాడకుండా దేశం గురించి మాట్లాడతవా? 3.7 కోట్ల మంది ప్రజలను బిచ్చగాళ్లను చేసిన నువ్వా 140 కోట్ల మంది గురించి మాట్లాడేది?
కేసీఆర్… జనం ద్రుష్టిలో జోకర్ లా మారినవ్… నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు. తెలంగాణ ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు ముందు నువ్వు సమాధానం ఇవ్వు. ఆ తరువాత దేశం గురించి మాట్లాడు.

దేశంలో నిజాయితీతో శక్తివంతమైన పాలన నడుస్తోంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినం. నీ నియంత-అవినీతి-కుటుంబ పాలనను చూసి అసహ్యించుకున్నారు కాబట్టే ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నరు. రోజురోజుకూ నీ గ్రాఫ్ పడిపోతుంటే… బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.
నీ పార్టీ ఎమ్మెల్యేలే గోడ దూకడానికి సిద్ధమైండ్రు… నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్లు సిద్ధమైండ్రు. అందుకే భయపడుతున్నరు. నిన్ను నమ్మి ప్రజలు నీకు అధికారమిస్తే.. ఇంత ఘాతుకానికి తెగబడుతున్నవా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే పొగుడుతువా? తెలంగాణలో ఎమర్జెన్సీవల్ల లక్షల మంది అల్లాడిపోయిన సంగతి మర్చిపోయి పొగుడుతున్నవంటే… నీలోపల నిజాం రజాకర్ బయటపడుతున్నడు. కేసీఆర్ కాయిల్ తప్పిండు.. టైం కాని టైంలో ప్రెస్ మీట్ పెడుతూ సీఎం స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నడు.. గతంలో ఆయన చేసిన తప్పులను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నడు. సీఎం మాటలకు భయపడే పార్టీ బీజేపీ కాదు… కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నడు. అందుకే ముఖ కవళికల్లో తేడా కన్పిస్తోంది. గజగజ వణుకుతున్నడు. అందుకే పదేపదే ఏక్ నాథ్ షిండేను గుర్తుకు చేసుకుంటున్నడు. ఆ రాష్ట్రంలోని ప్రజలు, నాయకులు కూడా అన్నిసార్లు షిండే పేరును గుర్తుకు తెచ్చుకోకపోవచ్చు… బహుశా ఆయన కుటుంబంలోనో, పార్టీలోనో ఏక్ నాథ్ షిండేలుగా మారుతున్నట్లున్నరు. అది తెలిసి నువ్వు బీజేపీపై అభాండాలు వేస్తున్నవ్. ప్రజలే కేసీఆర్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైండ్రు… మేం నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసిన సర్వేల్లోనే తెలుస్తుంది కదా… ప్రజలే నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమైండ్రు. ఎన్నికలెప్పుడు జరిగినా బీజేపీ సిద్ధంగా ఉందని మా అమిత్ షా చెప్పిండు..
నీ అవినీతి సంగతి తెల్వదా? ఎలుగుబంటి సూర్యనారాయణను తీసుకొస్తే అసలు సంగతి బయటపడతది.
కేసీఆర్.. రాష్ట్రపతి అభ్యర్ధి గురించి మాట్లాడుతున్నడు… నువ్వో పెద్ద తోపువి కదా.. బీజేపీ అభ్యర్ధిని ఓడగొట్టు చూద్దాం. టీఆర్ఎస్ సభ్యులకు విజ్ఝప్తి చేస్తున్నా… ద్రౌపది ముర్ము ఎస్టీ ఆదివాసీ వ్యక్తి. ఆమెకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.. తద్వారా దేశ ప్రజలకు మంచి సంకేతం పంపుదాం.కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపడానికే సిద్ధంగా ఉన్నరు.. ఇగ ఆయన దేశం గురించి మాట్లాడితే నమ్మేదెవరు? మోదీ నీలెక్క మాట తప్పలే…. 370 ఆర్టికల్ రద్దు చేస్తానని చేసిండు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిండు. సీఏఏ అమలు చేసిండు. కేసీఆర్ చేసిందేమిటి? ఆడవా ళ్లపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోవడం లేదు? ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు..
యోగి గారు సీఎం కాకముందు ఆయన కుటుంబం ఎట్లా ఉందో… ఇప్పుడు అట్లానే ఉంది. మరి కేసీఆర్ కుటుంబం సంగతేంది? కేసీఆర్ కుటుంబం అప్పుడెట్లా ఉండే.. ఇప్పుడెట్లా ఉందో ప్రజలకు తెల్వదా? ఆయనో పాస్ పోర్ట్ బ్రోకర్… చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్రను మర్చిపోతున్నడా? కాశ్మీర్ ఫైల్స్ ఏంది… రజకార్ ఫైల్స్ సినిమా తీస్తం… ఆయన అవినీతి బండారాన్ని బయటకు తీస్తం. కాశీ కట్టడాల గురించి మాట్లాడతావా? దుష్టులకు అన్నీ చెడ్డగానే కన్పిస్తయ్.. నువ్వొక నియంతవు. మానవ రూపంలో ఉన్న మ్రుగానివి. తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్న శనిలా దాపురించావు. మోదీ గురించి నువ్వా మాట్లాడేది… రోజుకు 18 గంటలు పనిచేస్తరు… ఏ దేశం పోయినా మళ్లీ తిరిగొచ్చి పనిచేస్తడు.. నువ్వేం చేస్తున్నవ్… ఫాంహౌజ్ దాటి బయటకు వస్తున్నవా?

Also Read కేసీఆర్ పాలనలో రౌడీ రాజ్యం – బండి సంజయ్ 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com