Saturday, March 14, 2026
Homeసినిమాకోవిడ్ బారిన త్రిష.... బండ్ల గణేష్ కు మూడోసారి!

కోవిడ్ బారిన త్రిష…. బండ్ల గణేష్ కు మూడోసారి!

Film industry- Carona: కరోనా థర్డ్ వేవ్ లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినిమా రంగానికి చెందిన పలువురు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, లక్ష్మీ మంచు, మీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సహా పలువురు కొవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో హీరోయిన్ త్రిష కూడా ఈ వైరస్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇప్పటికే రెండుసార్లు కోవిడ్ బారిన పడిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు మూడోసారి కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని అయన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడిస్తూ..కోవిడ్ పరీక్ష చేయించుకున్న రిపోర్ట్ ను జత చేశారు. మూడు రోజులపాటు తాను ఢిల్లీలో ఉన్నానని, తిరిగి వచ్చిన తరువాత కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని గణేష్ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని, తన కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ గా రిపోర్ట్ వచ్చిందని తెలియజేశాడు. ప్రయాణాలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సలహా ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular