Saturday, January 18, 2025
Homeసినిమానవంబర్ 9న ‘బంగార్రాజు’ ఫస్ట్ వీడియో సాంగ్

నవంబర్ 9న ‘బంగార్రాజు’ ఫస్ట్ వీడియో సాంగ్

Bangarraju First Video Song Will Be Released On November 9th Tomorrow :

నాగార్జున , రమ్యకృష్ణ కలసి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి ‘బంగార్రాజు’ పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా కు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో జంటగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ‘లడ్డుందా’ అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే.. ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది. ‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: పాత్రల్లో వైవిధ్యం…ప్రతిభకు ప్రోత్సాహం… నాగార్జున ప్రస్థానం

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్