Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: పాక్ పై  బంగ్లా గెలుపు

మహిళల వరల్డ్ కప్: పాక్ పై  బంగ్లా గెలుపు

Bangla beat Pak: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను దురదృష్టం వెంటాడుతోంది.  ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు ఆడినా ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేకపోయింది. నేడు బంగ్లాదేశ్ పై గెలవాల్సిన మ్యాచ్ ను చివర్లో చేజార్చుకుంది.  పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ ఒంటరి పోరు వృథా అయ్యింది. పాక్ పై బంగ్లా 9 పరుగులతో విజయం సాధించింది.

హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  బంగ్లా మహిళల జట్టు 37పరుగుల వద్ద మొదటి వికెట్ (షమీనా సుల్తానా 17), 79 వద్ద రెండో వికెట్ (షర్మిన్ అక్తర్-44)  కోల్పోయింది. మూడో వికెట్ కు ఫర్గానా హక్- కెప్టెన్ నిగర్ సుల్తానా 96 పరుగుల భాగస్వామ్యం  నెలకొల్పారు. హక్-71; నిగర్-46 పరుగులు చేసి ఔటయ్యారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  234 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు మూడు; ఫాతిమా సనా, నిదా దార్, ఓమనియా సోహైల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

పాకిస్తాన్ ఇన్నింగ్స్ నిలకడగానే ఆరంభించి మొదటి వికెట్ కు 91 పరుగులు చేసింది. ఓపెనర్ నహిదా 43 పరుగులు, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బిస్మా మరూఫ్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మరో ఓపెన్ సిద్రా అమీన్ నిలకడగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్ విమెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు కావాల్సిన దశలో 48వ  ఓవర్లో సిద్రా-104, రనౌట్ కావడంతోపాక్ ఆశలు గల్లంతయ్యాయి. పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ఫాతిమా ఖతున్ మూడు; రుమానా అహ్మద్ రెండు; జహానారా ఆలమ్, సల్మా ఖతున్ చెరో వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లు సాధించిన ఫాతిమా ఖనుమ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్