ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వల్ల ఖండాంతరాలను దాటిన బతుకమ్మ సంబరాలు ప్రతియేటా వివిధ దేశాల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి . ఉద్యోగ , వ్యాపార రీత్యా ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు తమ పండుగలను జరుపుకొనుటలో, తమ ఆచార వ్యవరాహలను పాటిస్తున్నారు . ముఖ్యంగా తెలంగాణలో అనాది నుండి ప్రత్యేకతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ, తమ ప్రాంత జానపద రూపంలో గేయాలను ఆలపిస్తూ మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు . ఆధునిక సాంకేతికత సంతరించుకున్న తరుణంలో ప్రత్యేక్షంగా తిలకించి గలుగుతున్నాం. రికార్డింగ్ పాటలు , విద్యుత్ ఆలంకరణలు , సౌండ్ బాక్స్ లతో లయబద్దంగా ఆడి పాడుతూ పండుగ రోజు మహిళలు ఆనందంగా గడుపుతారు .
కాగా ఈ ఏడాది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రం బెంటన్విల్లే నగరంలో తెలుగు ప్రజలు కుటుంబ సభ్యులతో కలసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. Walmart కు కేంద్రమైన బెంటన్విల్లే నగరంలో గల హిందూ దేవాలయం ట్రస్ట్ నేతృత్వంలో ఇక్కడ గల తెలుగు కమ్యూనిటీ ప్రజలు పూల బతుకమ్మ నిర్వహించారు. సద్దుల బతుకమ్మ సైతం సోమవారం ఘనంగా చేశారు. తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా ఎంతో వైభవంగా జరిపారు. రంగు రంగుల పూలతో అలంకరించిన చిన్న చిన్న బతుకమ్మలను ఇండ్లల్లో పూజించిన అనంతరం ఒకచోట చేర్చి బతుకమ్మ పాటలకు లయబద్దంగా ఆడుతూ , దాండియా ఆటలతో నృత్యాలు చేశారు. తర్వాత స్థానికంగా అందుబాటు గల నీటి కొలనులల్లో నిమజ్జనం చేశారు .
Also Read: జగత్ జనని ఆరాధనతో.. దేశమంతా ఆధ్యాత్మిక శోభ