Friday, March 28, 2025
HomeTrending Newsతెలుగు ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు

తెలుగు ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక,  రాష్ట్ర పండుగ బతుకమ్మ  ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు.  తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు   ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు  బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని సిఎం తెలిపారు. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైన  ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు.

బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నీటితో నిండి వున్నాయని, బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని అమ్మవారిని సిఎం కేసీఆర్  ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్