ఆసియా కప్ క్రికెట్ మహిళా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలో 15 మందిని ఎంపిక చేశారు. అక్టోబర్ 1 నుంచి 15 జరగనున్న ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. ఆరంభ మ్యాచ్ లో ఇండియా జట్టు శ్రీలంకతో తలపడనుంది. మొత్తం ఏడు దేశాలు… ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాల్గొంటున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఒక్కో జట్టూ మిగిలిన ఆరు జట్లతో ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ ముగిసే సమయానికి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుకుంటాయి, ఫైనల్ మ్యాచ్ 15న జరుగుతుంది. ఈ టోర్నీలో అంపైర్లు, రెఫరీలు గా కూడా మహిళలే ఉంటారని, అల్-విమెన్ టోర్నీగా ఇది ఉండబోతుందని షా వెల్లడించారు.
ఇండియా జట్టు వివరాలు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందానా (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జేమిమా రోడ్రిగ్యూస్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ రానా, దయాలన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయక్వాడ్, రాధా యాదవ్, కేపీ నవ్ గిరే
సిమ్రాన్ బహదూర్, తానియా భాటియా స్టాండ్ బై ప్లేయర్స్ గా కొనసాగుతారు.
ప్రసుతం ఇంగ్లాండ్ లో ఇండియా మహిళా జట్టు పర్యటిస్తోంది. ఈ టూర్ లో ఇప్పటికే టి 20సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ లో ఆడిన జట్టునే యధా’తథంగా ఆసియా కప్ కు ఎంపిక చేయడం గమనార్హం.
Also Read: ఐసీఎంఆర్ ఇండియా విశ్లేషణ