Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్జాతీయ జట్టులో నితీష్, అభిషేక్

జాతీయ జట్టులో నితీష్, అభిషేక్

గత నెలలో ముగిసిన ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి మంచి ప్రతిభ కనబరచిన తెలుగు ఆటగాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జూలై లో జింబాబ్వేతో ఆ దేశంలో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు వీరిద్దరినీ బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

శుభ్ మన్ గిల్ సారధ్యంలో 15 మంది ఆటగాళ్ళతో జట్టును ప్రకటించారు.  వీరితో పాటు టి 20 లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ లకు కూడా స్థానం లభించింది.

జట్టు వివరాలు: శుభ్ మన్ గిల్ (కెప్టెన్); యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శామ్సన్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగానే ఈ ఐదు మ్యాచ్ లూ జరగనున్నాయి. జూలై 6న మొదటి మ్యాచ్….. 7,10,13,14 తేదీల్లో మిగిలిన నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్