కోవిడ్ పై పోరుకు తన వంతు సాయంగా 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న 2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. కోవిడ్ రెండో దశలో ప్రధానంగా ప్రాణాధారమైన ఆక్సిజన్ మరియు అందించే వైద్య పరికరాల కొరత దేశాన్ని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో దాతలు ముందుకొచ్చి విదేశాల నుంచి పెద్ద ఎత్తున కాన్సన్ట్రేటర్లు దిగుమతి చేయించి అందిస్తున్నారు.
వీలైనత వీలైనంత త్వరలో ఈ పరికరాలు దేశంలో పలు ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి వెల్లడించారు. కోవిడ్ పై పోరులో తమ వంతు మద్దతు అందించాలన్నదే లక్ష్యమని చెప్పారు. ‘మన ప్రాణాలు కాపాడడానికి వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని, వారి సేవేలకు మనవంతు తోడ్పాటు కూడా అందిచాల’ని గంగూలీ చెప్పారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటానికి దోహదపడతాయని చెప్పారు.