Monday, February 24, 2025
HomeTrending NewsYanamala: బిసిల విషయంలో జగన్ కొంగ జపం

Yanamala: బిసిల విషయంలో జగన్ కొంగ జపం

బీసీలకు తాము అండగా ఉన్నామని వైఎస్సార్సీపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. బిసిల విషయంలో జగన్ కొంగజపం చేస్తున్నారని, తడి గుడ్డతో గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. బీసీల ఆస్తులు లాక్కొని వారి సమాధులపై అవినీతి సామ్రాజ్యం నిర్మిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

వైసీపీ దోపిడీకి అత్యధికంగా బలవుతున్నది బిసిలేనని యనమల అన్నారు. ఇప్పటి వరకూ 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను బిసిలనుంచి లాక్కున్నారని, సంక్షేమ పథకాల్లో కూడా  కోత పెడుతున్నారని, 75,760 కోట్ల రూపాయల బిసి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించారని  ఆందోళన వ్యక్తం చేశారు.  జనగణన కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానంపై జగన్ నోరు మెదపడంలేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని యనమల ఆగ్రహం వెలిబుచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్