Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిశ్వ సుందరి ఉవాచ!

విశ్వ సుందరి ఉవాచ!

Lets talk about more important things
happening world wide..
ప్రపంచంలో జరుగుతున్న విషయాలపై మనం స్పందించాలి..
21 ఏళ్ళ తర్వాత భారతదేశానికి విశ్వసుందరి కిరీటాన్ని సాధించిపెట్టిన “డైలాగ్” ఇది.
ప్రస్తుతం అమ్మాయిలకు వున్న ఒత్తిళ్లేంటన్నది నిర్వాహకుల ప్రశ్న.
దానికి “ఇండియన్ బ్యూటీ” హర్నాజ్ సంధు చెప్పిన సమాధానమది.
అద్భుతమైన ఆ మేథోశక్తికి ఉబ్బితబ్బిబ్బై విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు..
ఇప్పుడు ఆమె కేవలం బ్యూటీ మాత్రమే కాదు..
బ్యూటీ విత్ బ్రెయిన్..
అసలు ఈ మాటే పెద్ద బూతు.

Beauty Contests

అందమైన అమ్మాయిలకు బుర్ర వుండదు…
బుర్రుండే అమ్మాయిలు ఆకర్షణీయంగా వుండరు….
ఇదే మన బుర్రల్లో నిడిపోయిన అభిప్రాయం..
అప్పుడప్పుడూ ఈ అభిప్రాయం తప్పని మన జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి.
అప్పుడు అరె.. ఈ అమ్మాయిలో అందం, తెలివీ రెండూ వున్నాయే అనే ఆశ్చర్యపోతాం.
అదొక అద్భుతంగా గుర్తిస్తాం.
అందాల పోటీలు కూడా అనేకరౌండ్ల అంగాంగ పోటీల తర్వాత
ఇలాంటి ఒకటి రెండు ప్రశ్నలతో తెలివితేటల్ని అంచనా వేస్తాయి.
అటు, అందం..ఇటు తెలివి.. రెండూ అద్భుతమని తెలుస్తాయి.
హర్నాజ్ సంధు కూడా అలాగే తన ప్రజ్ఞని ప్రదర్శించింది.
ఒక వాక్యానికీ, మరో వాక్యానికీ సంబంధం లేకపోతేనేం..
అద్భుతమైన ఆన్సరిచ్చింది..
ఆ నాలుగైదు వాక్యాలనీ విడమరిచి చూద్దాం..
వాటిపై ఆమెకి ఎంత అవగాహన వుందో అర్థమవుతుంది.
“The biggest pressure the youth of today is facing is to believe in themselves.
To know that you are unique makes you beautiful. Stop comparing yourselves
with others and let’s talk about more important things that are happening
worldwide. Come out, speak for yourself, because you are the leader of your
life. You are the voice of your own. I believed in myself and that is why I am
standing here today,”
ఇదే హర్నాజ్ చెప్పిన సమాధానం.
తమ మీద తమకి నమ్మకంలేకపోవడమే ఈతరం వారికున్న పెద్ద సమస్య ..
మీకు మీరే ప్రత్యేకమని తెలుసుకోవడమే మీ సౌందర్యం..
ఇతరులతో పోల్చుకోవద్దు..
హర్నాజ్ చెప్పిన సమాధానంలో మొదటి భాగం ఇది.


మీరెప్పుడైనా అందాల పోటీలు చూశారా..
మైనం ముద్దల్లాగా..
పోతపోసిన బొమ్మల్లాగా..
ప్లాస్టిక్ నవ్వులు,
కృత్రిమ నడకలు..
నిర్వాహకులు నిర్దేశించిన కొలతల్లో కుదించుకున్న శరీరాలు..
ఈ పోటీలోనే కదా హర్నాజ్ విశ్వవిజేత అయింది.
83దేశాల అందగత్తెలను పక్కపక్కనే నిలబెట్టి..
బీచ్ వేర్, ఈవెనింగ్ వేర్ లాంటి ముద్దుపేర్లతో
అంగాంగ ప్రదర్శనలు చేయించి,
ఏ అవయవానికి ఆ అవయవాన్ని కొలిచి, పోల్చి..
హర్నాజ్ ని అత్యుత్తమ అందగత్తెగా తేల్చారు.

మిగిలిన వాళ్ళందరికంటే తానే ఎక్కువ అందగత్తెనని నిరూపించుకోడానికి
ఇజ్రాయెల్ దాకా వచ్చిన అమ్మాయి.. ఎవరితోనూ పోల్చుకోవద్దని చెప్తోంది..
you are unique and beautiful అనే మాటకి ఆమెకి అర్థం తెలుసనుకోవాలా?
ఆ తర్వాత వస్తుంది..ఇంకో అద్భుతమైన వాక్యం.
“మన చుట్టూ వుండే మరింత ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడాల” ట.
ఆమె… ఏ ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడగలదు?
తను పుట్టి పెరిగిన పంజాబ్ చండీగఢ్ రాష్ట్రాల్లో రైతు ఉద్యమాల గురించి మాట్లాడగలదా?..
పోనీ ఆ పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఇజ్రాయిల్ అరాచకాల గురించైనా ఆమెకి తెలుసా?
చరిత్ర దాకా అవసరం లేదు.. పాలస్తీనియుల్ని కాలరాస్తున్న వర్తమానమైనా తెలుసా?
అవన్నీ తెలిస్తే అసలు అక్కడ అలాంటి వేడుకల్లో పాల్గొంటుందా?
ఊరికే బావుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరిపోతుందా?..
ఇది కేవలం హర్నాజ్ మీద విమర్శ కాదు..
అవునన్నా కాదన్నా.. అందాల పోటీలు అంగాంగ పోటీలే..
దీని వెనుక వున్నది..వేలకోట్ల కాస్మొటిక్ మార్కెటే..
దాన్ని మసిపూసి మహా విజ్ఞాన ప్రదర్శన కింద మారిస్తే సహించలేం..
మహిళా చైతన్య వేదికలుగా కలర్ ఇస్తే..ఒప్పుకోలేం.


హర్నాజ్ లాంటి అమ్మాయిలకి నిజంగా తను చెప్పిన మాటలకి అర్థం తెలియాలంటే..
మియన్మార్ మోడల్ తుజార్ వింట్విన్ గురించి తెలుసుకోవాలి.
విశ్వసుందరి వేడుకలని ప్రజాస్వామ్య పోరాట వేదికలుగా మార్చిన తీరును తెలుసుకోవాలి..
అందాల పోటీల్లో గెలవకపోయినా..
పోటీల తర్వాత పూర్తిస్థాయి ఉద్యమకారిణిగా మారిపోవడం గురించి తెలుసుకోవాలి.
పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదు తుజార్..
తను అనుకున్నదేదో చేసి చూపించింది..

నమ్మిన ఆశయానికి కట్టుబడే ధైర్యం..
సమయం వచ్చినప్పుడు చూపించే సాహసం
అదే నిజమైన అందం..
అదే అసలైన గౌరవం..
దీనికి ఏ పోటీలు అక్కర్లేదు.
ఏ కిరీటాలతోనూ పనిలేదు.

-శివప్రసాద్

Also Read : అందమా! అందుమా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్