Sunday, January 19, 2025
HomeTrending Newsవాస్తవాలు చెబుతూనే ఉంటాం: అంబటి

వాస్తవాలు చెబుతూనే ఉంటాం: అంబటి

Non-stop: పోలవరం విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న పత్రికలు తమ ప్రభుత్వంపై కావాలని పదే పదే దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జనలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు డయా ఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో చెప్పకుండా,   ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేలా  ఈ విషప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు అర్ధమయ్యేవరకూ తాము అసలు విషయాన్ని ప్రజలకు వివరిస్తూనే ఉంటామని చెప్పారు.  పోలవరం ప్రాజెక్ట్ పై అంబటి  రాంబాబు మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  నేడు వివిధ పత్రికల్లో ప్రాజెక్ట్ ఆలస్యంపై వచ్చిన వార్తలను ఖండించారు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అసలు పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండానే ప్రచార ఆర్భాటాల కోసం డయా ఫ్రమ్ వాల్ నిర్మించారన్నారు. అసలు కాఫర్ డ్యాం కట్టకుండానే డయా ఫ్రమ్ వాల్ నిర్మించిన  గత ప్రభుత్వపు తెలివితక్కువ తనం వల్లే ఈ నష్టం జరిగిందని పునరుద్ఘాటించారు.  గతంలో 400 కోట్ల రూపాయలతో డయాఫ్రం నిర్మించారని ఇప్పుడు మళ్ళీ దాన్ని నిర్మించాలంటే దాదాపు 500కోట్ల రూపాయల వరకూ ఉంటుందని వెల్లడించారు.  పునరావాస కార్యక్రమాల్లో కమీషన్లు రావని, అందుకే దాన్ని పట్టించుకోలేదన్నారు.

అసలు స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం ల నిర్మాణం మొదలుపెట్టారని, దీనివల్ల 45 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తుందని.. ఆ గ్రామాల వారు తమ ఆర్ ఆర్ సంగతి తేలకుండా కాఫర్ డ్యాంలు పూర్తి చేయవద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే అప్పుడు వాటి నిర్మాణం ఆపాల్సి వచ్చిందని రాంబాబు వివరించారు. ఆర్ ఆర్ మీద కేవలం 200నుంచి 300కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేస్తే తాము 1500కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు.

కాంట్రాక్టర్ ను మార్చడం వెళ్ళే పోలవరం ఆలస్యమయ్యిందన్న టిడిపి నేత దేవినేని ఆరోపణలను రాంబాబు తోసిపుచ్చారు. గతంలో ట్రాన్స్ టాయ్ కంపెనీని మార్చి నవయుగ కు కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారు మారిస్తే త్వరితగతిన పూర్తి చేయడానికి, తాము మారిస్తే ఆలస్యం కోసమా అని నిలదీశారు.  తాము కంట్రాక్టర్ ను మార్చడం ద్వారా 12.6శాతం ఖర్చు తగ్గించగలిగామన్నారు.

Also Read : టిడిపి నేతలు భాష మార్చుకోవాలి: అంబటి  

RELATED ARTICLES

Most Popular

న్యూస్